అలలు... తీరం తాకాలని ,
నా కలలు...నీ హృదయం చేరాలని,
కలల అలలు నిజమైతే........
తీరాలు మాయమౌతాయి .
Thursday 5 January 2012
కలల తీరం
పాదం పలుకునా...
మౌనమే మాటలాయే, నీ తలపుల చర్చల్లో .....
చూపులే చేతలాయే , నిను చూసిన సందడిలో....
అధరాలే మూగబోయే , నీ నవ్వుల పదనిసలో....
చిరునవ్వే వీడదాయే , నీ మాటల మధురిమలో...
పాదమే పలుకదాయే , నువు నడవని దారుల్లో.
ప్రకృతి తో ....
గాలి పాట ... గడ్డి పూల ఆటా,
కొమ్మల సై ఆట ....... పువ్వుల విరి తోట ,
పుడమి తల్లి నీళ్ళ ఆట.......ప్రకృతి ఆడే పాత ఆట.
కాని ,
చూపుల దొంగాట ' నీ -నా ' లకు కొత్త ఆట.
Subscribe to:
Posts (Atom)